రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అన్నయ్య పాత్ర కి నో చెప్పిన హీరో!!

రంగస్థలం సినిమా తో రామ్ చరణ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో, ఆయన అన్నయ్య గా నటించిన ఆది పినిశెట్టి కి కూడా అలాంటి పేరు వచ్చింది.

సరైనోడు చిత్రం లో విలనిజం ని ఒక రేంజ్ లో పండించిన ఆది పినిశెట్టి నుండి ఇంత పాజిటివ్ రోల్ ఎవ్వరూ ఊహించలేకపోయారు.  

అయితే ఈ రోల్ కోసం తొలుత తమిళ హీరో ఆర్య ను సంప్రదించారట. కానీ ఆ సమయానికి ఆయన ఖాళీగా లేకపోవడం తో ఆది తో చేసారు. 

ఏదేమైనా ఆది రామ్ చరణ్ తో పోటీపడి మరీ నటించాడనే చెప్పాలి. విడుదల తర్వాత ఈ రోల్ ని మిస్ అయ్యినందుకు ఆర్య చాలా ఫీలయ్యాడట.