చలికాలంలో పెదాలు పగులుతున్నాయా.. అయితే ఇలా చేయండి !

చలికాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. జలుబు, జ్వరం లాంటివే కాకుండా పెదాలు కూడా పగులుతాయి. 

పెదాలు పగలకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. చలికాలంలో పెదాలు పగలడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి 

మన శరీరంలో తేమ అనేది లేకపోవడమే దీనికి కారణం. చలికాలంలో ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల పెదవులు  పగులుతాయి.

విపరీతంగా సబ్బు రాయడం వల్ల పెదాలు పగులుతాయి. అయితే చిన్ప చిన్న చిట్కాలు పాటిస్తే దీనినుంచి తప్పించుకోవచ్చు.  

పగిలిన చోట మంటగా ఉంటే నెయ్యి రాయలి. అది పెదాలను మృదువుగా మారుస్తుంది. 

పెదాలు పొడిబారితే రెండు చుక్కల తేనె రాయలి. దీనిలోని యాంటీ మైక్రో బియల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు పగుళ్లు రాకుండా చేస్తాయి.  

కొబ్బరి నూనె రాసిన ఇన్ఫెక్షన్లు మరియు పగుళ్లు రాకుండా చూసుకోవచ్చు. కలబంద గుజ్జును రాసినా పగుళ్లు తగ్గుతాయి