లాంచ్‌కు ముందే లీకైన ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్.. మెయిన్ హైలెట్స్ ఇవే! 

ఐకూ నుంచి ఓ కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. అయితే లాంచ్ కు ముందే ఈ ఐకూ నియో 9 సిరీస్ స్పెసిఫికేష‌న్స్ లీక్ అయ్యాయి. వాటిలో మెయిన్ హైలెట్స్ 

ఈ మొబైల్ 6.78 అంగుళాల OLED డిస్‌ప్లే తో పాటు 1.5కె రిజల్యూషన్‌ ,మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్ఓసీ ప్రాసెస్ ను ఇందులో కలిగి ఉంటుంది.

ఫోన్ వెనుక భాగంలో, 50 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్ స్నాపర్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ఎక్స్‌920 ప్రైమరీ షూటర్ ఉంటుంది. 

సెల్ఫీలు మరియు వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రెంట్‌ కెమెరా , 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000 ఎమ్ఏహెచ్ బ్యాట‌రీ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

12జీబీ ర్యామ్ + 256జీబీ ఇంట‌ర్న‌ల్‌ స్టోరేజీ మరియు 16జీబీ ర్యామ్ + 512జీబీ ఇంట‌ర్న‌ల్‌ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది.

ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఉంటుంది.  మొత్తానికి ఈ ఫోన్ కి డిమాండ్ మార్కెట్ లో భారీగానే ఉంది.