6 నెలల్లో మళ్లీ కేసీఆర్‌ సర్కారే..ఇదే ఫ్రూఫ్‌ ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

అయితే ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. అని సందేహం ఉంది. 

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాంబు పేల్చారు. మరో ఆరు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం  రాబో తుందని  తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు తక్కువగా ఉన్నాయని…. మా పార్టీకి దాదాపు 40 సీట్లు ఉన్నాయని ఈ  నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదని అన్నారు. 

మరో ఆరు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి. దీంతో కాంగ్రెస్ పార్టీ గజగజ వణుకుతోంది.