telugu.pakkafilmy.com

Payal Rajput: తండ్రి గురించి పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్ పోస్ట్

‘పాపా, నిన్ను కోల్పోయి ఏడాది అయ్యింది… నిన్ను కాపాడాలని ఎంతో ప్రయత్నించాను’ అంటూ పాయల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఆపరేషన్‌కు ఒప్పుకున్నందుకు కొన్నిసార్లు తనలో పశ్చాత్తాపం కలుగుతుందని, అయితే తండ్రి క్యాన్సర్‌ను జయించాలనే పట్టుదలతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని ఆమె వివరించారు.

పాయల్ తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (68) క్యాన్సర్‌తో పోరాడి 2025 జులై 28న హైదరాబాద్‌లో కన్నుమూశారు.

ఆయనను తన హీరోగా, అతిపెద్ద క్రిటిక్‌గా ఆమె పలుమార్లు అభివర్ణించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా తండ్రి జ్ఞాపకాలతో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.

ఆ సమయంలో తల్లిని ఓదార్చడం ఎలాగో తెలియక పూర్తిగా కుంగిపోయానని ఆమె పేర్కొన్నారు.

ఈ కష్టకాలం నుంచి బయటపడేందుకు జైపూర్‌లో విపశ్యన ధ్యాన శిబిరంలో పాల్గొన్నానని, అది తనకు మనశ్శాంతిని ఇచ్చిందని పాయల్ వెల్లడించారు.

మరిన్ని వెబ్ స్టోరీస్

Revanth Reddy: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణVenkatesh AK47: నివేతా పెతురాజ్, డింపుల్ హయతి కీ రోల్స్Revanth Reddy: రేవంత్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలపై ఘాటు విమ...