ఎన్టీఆర్ 31పై ప్రశాంత్ నీల్ కీలక కామెంట్.. అభిమానుల్లో ఉత్కంఠ

ఎన్టీఆర్‌ హీరో గా దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో తెరకెక్కించబోయే సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దేవర తర్వాత ఇదే సినిమా..

అయితే ప్రశాంత్ నీల్ తాజాగా చేసినవ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెంచేసింది. సినిమా కథకు నేపథ్యం ఏంటనే విషయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అయిన నీల్ ఇప్పటివరకూ తాను తీసిన చిత్రాలన్నిటికీ ఇది విభిన్నంగా ఉంటుందన్నారు. అయితే, కథ నేపథ్యం ఏమిటో పూర్తిగా వెల్లడించలేదు. 

ఇది యాక్షన్ చిత్రమన్న భావన ప్రజల్లో ఉందని, జానర్ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్ అవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.     

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ పార్ట్-1- సీజ్ ఫైర్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 21 న విడుదల కాబోతుంది.