మహిళ ఆత్మహత్య.. ‘పుష్ప’ యాక్టర్ జగదీశ్‌‌  అరెస్ట్

‘పుష్ప’లో హీరో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్రలో కనిపించిన నటుడు జగదీశ్‌‌ను (కేశవ) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 

ఓ జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉండగా ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడిన నేరంపై అతడిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న మహిళ.. జగదీశ్ వేధింపుల నేపథ్యంలో గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది.

గత నెల బాధిత మహిళ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించగా ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న జగదీశ్‌ను నేడు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, మృతురాలితో జగదీశ్‌కు గతంలో పరిచయం ఉండేదని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న జగదీశ్‌ను నేడు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, మృతురాలితో జగదీశ్‌కు గతంలో పరిచయం ఉండేదని పోలీసులు తెలిపారు.