రెడ్‌మీ నోట్ 12పై భారీ డిస్కౌంట్‌.. డెడ్ చీప్ ధ‌ర‌కే క్రేజీ స్మార్ట్‌ఫోన్‌!

 రెడ్‌మీ వచ్చే ఏడాది మార్చిలో క్రేజీ ఫీచ‌ర్ల‌తో ఓ మొబైల్ ను లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ నోట్ 12 4జీ.  120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్‌ అమొలెడ్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. 

డిస్‌ప్లేకు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ఉంటుంది.   స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్ ఈ హ్యాండ్‌సెట్ లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో వ‌ర్క్ చేస్తుంది.  

కెమెరా విష‌యానికి వ‌స్తే.. రెడ్‌మీ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ వెన‌క‌వైపు ట్రిపుల్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. 

అందులో ప్ర‌ధాన కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా.. 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లు ఉంటాయి.  

అలాగే సెల్ఫీ మ‌రియు వీడియో కాల్స్ కోసం ముందు వైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అమ‌ర్చారు.  

33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎమ్ఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ ఈ ఫోన్ సొంతం. స‌న్‌రైజ్ గోల్డ్‌, ఐస్ బ్లూ, బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్స్ లో ఈ ఫోన్ ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. 

6జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 64జీబీ వ‌ర‌కు ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ను ఈ ఫోన్ క‌లిగి ఉంది. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. రెడ్‌మీ నోట్ 12 4జీ అస‌లు ధ‌ర రూ. 18,999. 

అయితే అమెజాన్ తాజాగా 37 శాతం డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. దీంతో రెడ్‌మీ నోట్ 12 4జీ ధ‌ర రూ. 7000 దిగొచ్చింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవ‌లం రూ. 11,999కే ల‌భిస్తోంది.