కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అయిన హీరోయిన్ సమంత

హీరోయిన్ సమంత ప్రస్తుతం  సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. అయినా ఆమె జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు 

తాజాగా ఆమె సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. దీన్ని నిన్న అధికారికంగా ప్రకటించారు.  'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరుతో  ప్రారంభించారు.  

తనకు ఎంతో ఇష్టమైన ఇంగ్లీష్ పాప్ సాంగ్ 'బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్' స్ఫూర్తితో తన ప్రొడక్షన్ హౌస్ కి ఈ పేరు పెట్టినట్టు ఆమె వెల్లడించారు.  

తన నిర్మాణ సంస్థ ద్వారా  కొత్త తరం ఆలోచలను ప్రోత్సహిస్తానని సమంత తెలిపారు. కొత్త ఆలోచనలను, కంటెంట్ ను ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. 

అర్థవంతమైన, యూనివర్సల్ కథలను తెరకెక్కిస్తామని, సమాజంలోని సంక్లిష్టతలు, బలాలను తెలియజేసే విధంగా సినిమాలు  ఉంటాయన్నారు.