హెడ్‌ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..?  ఈ సమస్యలు తప్పవు..?

ప్రతి ఒక్కరు గంటల తరబడి మొబైల్స్ వాడడం ప్రమాదం. దానికి తోడు హెడ్‌ఫోన్స్ వాడడం మనం చూస్తూనే ఉన్నాం. 

ఇలా ఎక్కువసేపు హెడ్‌ఫోన్స్ వాడడం వల్ల చెవులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీకు తెలుసా?  

దీనివల్ల వినికిడి సామర్థ్యం తగ్గడం, చెవుల్లో వివిధ రకాల శబ్దాలు ప్రతిధ్వనించడం, తల తిరగడం, మైగ్రేన్  వంటి అనేక సమస్యలోస్తాయాట.

పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే హెడ్‌ఫోన్‌ల వాడకం తగ్గించాలి.ఒకవేళ  తప్పనిసరైతే కొంత విరామం తీసుకొని ఉపయోగించవచ్చు.  

హెడ్‌ఫోన్‌లను ఎక్కువగా వాడడం హృదయానికి మంచిది కాదు.  దీని నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై చెడు ప్రభావం చూపుతాయి.  

ఇవే కాదు చాలా మంది నిద్ర భంగం, నిద్రలేమి, స్లీప్ అప్నియాతో కూడా బాధపడే అవకాశం ఉంది. 

ఇయర్‌ఫోన్‌ల అధిక వినియోగం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా వ్యక్తి ఆందోళన లేదా ఒత్తిడి సమస్యలను కలిగి ఉండే అవకాశం ఉంటుంది.