
తర్వాత 1972లో ‘నీతి నిజాయితీ’ తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.
తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 60 సినిమాలు తీశారు.
డాక్టర్ రాజ్‌కుమార్‌తో 1980లలో ఏడు కన్నడ సినిమాలు చేయగా, కమల్ హాసన్‌తో కలిసి తమిళంలో చేసిన సినిమాలు ఆయన్ను దక్షిణాది అంతా పరిచయం చేశాయి.
ఆయన కెరీర్‌లో అతిపెద్ద సాహసం ‘పుష్పక విమానం’ (1987).
భారతదేశంలో సంభాషణలు లేకుండా వచ్చిన తొలి సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు గెలుచుకుంది.
మాటలు లేకుండానే భావోద్వేగాలను, హాస్యాన్ని పండించగలగడం అప్పట్లో పెద్ద ప్రయోగం.
ఇవి కూడా చదవండి: అంతకుముందు ‘మయూరి’ (1985) సినిమా ఏకంగా 14 నంది అవార్డులు సాధించి రికార్డు సృష్టించింది.
ఆ తర్వాత 1989లో వచ్చిన ‘అపూర్వ సహోదరులు’ లో మరుగుజ్జు పాత్ర ద్వారా కొత్త సాంకేతిక ప్రయత్నం చేశారు.
1991లో బాలకృష్ణతో తీసిన ‘ఆదిత్య 369’ తెలుగులో టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్‌కు మైలురాయిగా నిలిచింది.
సినిమా అంటే కొత్తదనం అనే నమ్మకంతోనే ఆయన ప్రతి దశాబ్దంలోనూ భిన్నమైన కథలను ఎంచుకున్నారు.
ఇవాళ్టి కుర్ర దర్శకులు కూడా ఆయన సినిమాలను పాఠాలుగా చూస్తున్నారంటే ఆ ప్రయోగాల విలువ అర్థమవుతుంది.
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు (2011), బి.ఎన్.
రెడ్డి జాతీయ అవార్డు (2012) ఆయన్ను వరించాయి.
మరిన్ని వార్తల కోసం..