వ‌రుణ్ తేజ్ పెళ్లిలో చిరు కూతురు సుస్మిత డ్రెస్ ఖరీదెంతో తెలుసా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ ఫైనల్ గా ఓ ఇంటివాడు అయ్యాడు. లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేశాడు. ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం జరిగింది

ఈ పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు, నిర్మాత అయిన సుస్మిత వేసుకున్న ఓ డ్రెస్ ఖ‌రీదు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

మెహందీ ఫంక్షన్‌లో సుస్మిత గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్ లో మెరిసింది. ఈ డ్రెస్ చాలా డిఫ్రెంట్ గా ఉంది. దీనిని ఎవరా కఫ్తాన్ డ్రెస్ అని అంటార‌ట‌. 

ప్రముఖ డిజైనర్ మృణాళిని రావు సుస్మిత డ్రెస్ ను డిజైన్ చేశారు. ఈ డ్రెస్ మ‌న‌కు ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంది.  

ఈ గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్ ఖ‌రీదు అక్ష‌రాల రూ. 1,79,200. స్మాల్ నుంచి ఎక్స్‌ట్రా లార్జ్ వరకు ఇదే ధర వ‌ర్తిస్తుంది. కానీ, డబుల్ ఎక్స్‌ఎల్ సైజు డ్రెస్ ధర మాత్రం రూ.1,97,120.