పిల్లలు పుట్టే విషయంలో ఈ జాగ్రతలు తప్పకుండా తీసుకోవాలి

పెళ్ళైన వారికి పిల్లలు కావాలనే కోరిక ఉంటంది. అయితే పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ తీసుకునే వారు మాత్రం కొన్ని జాగ్రతలు తప్పక పాటించాలి అంటున్నారు నిపుణులు. 

సంతానోత్పత్తి చికిత్స తీసుకుంటున్నప్పుడు మీ శారీరక, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి.

అందుకు అనుకూలమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.   అలాగే కొన్ని కొన్నిటికి దూరంగా కూడా ఉంటాయి. 

పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో మొదట తెలుసుకుందాం. 

బీన్స్ మరియు కాయధాన్యాల్లో ఫైబర్, ప్రోటీన్‌, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.  అందువల్ల అవి సంతానోత్పత్తిని పెంచడానికి  సహాయపడతాయి.  

బాదం, వాల్ నట్స్‌, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు వంటి వాటిని తీసుకోండి. తద్వారా పురుషుల్లో వీర్యకణాల శక్తి పెరుగుతుంది.