పిల్లలు బాధ్యతను నేర్చుకునేందుకు ఇలా చేయండి!!

పిల్లలు చిన్నతనంలో నేర్చుకునే అలవాట్లే వారు జీవితాంతం కొనసాగిస్తారు. అలా పిల్లలు చిన్నవయసులోనే బాధ్యత తీసుకోవాలనుకుంటే తల్లిదండ్రులు ఇలా చేయాలి.  

పాఠశాల నుండి వచ్చిన తర్వాత వారి బూట్లు మరియు సాక్స్లను సరైన స్థలంలో ఉంచమని సూచించండి. ప్రతిరోజూ శుభ్రమైన సాక్స్ ధరించమని చెప్పండి.

పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్‌లో ఉన్న టిఫిన్‌ బాక్స్‌ తీసేయమని చెప్పండి. లేదంటే అందులో బ్యాక్టీరియా పేరుకుపోతుంది.

పిల్లలకు భోజనం చేసే ముందు చేతులు శుభ్రం చేసుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని చెప్పండి.

పిల్లలకు రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయాన్నే లేవడం అలవాటు చేయమని చెప్పండి. ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవాలని చెప్పండి.

యూనిఫాంను సొంతంగా వేసుకోమని చెప్పండి. పాఠశాలలో బట్టలు శుభ్రంగా ఉంచాలని చెప్పండి. పొద్దునే తను పడుకున్న మంచాన్ని సర్దమని చెప్పాలి