కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటి జోలికి అస్సలు పోకండి!!

మన శరీరంలో సున్నితమైన పార్ట్ అయిన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తగ్గ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి 

కిడ్నీలపై ఎఫెక్ట్ రాకూడదంటే ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. నూనె పదార్థాలు, వేయించిన పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను పూర్తిగా తగ్గించాలి.

ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్స్ ఫైబర్ కంటెంట్ తృణ ధాన్యాలను ఉంచేలా చూసుకోవాలి. ఆల్కాహల్ పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. 

జ్యూస్, లెమన్ వాటర్ ,కొబ్బరి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరం డిహైడ్రేట్ కాకుండా మూత్రపిండాలు కండరాలను చాలా బలంగా ఉంచేలా చేస్తుంది. 

వీలైనంతవరకు ఉప్పు తినడం తగ్గించాలి. దీని వల్ల రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కాఫీ వంటివి తగ్గించాలి. ఇది ఎసిడిటీ ని తగ్గిస్తుంది.