నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం..  జీరో టికెట్ అంటే?

తెలంగాణలో మహిళలు, బాలికలు, విద్యార్థినులు, హిజ్రాలూ సిటీ ఆర్టినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. 

వయసుతో సంబంధం లేదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఇందుకోసం మహిళలు మహాలక్ష్మి కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు కలిగి వుండాలి అన్నారు.

వారం పాటూ గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణం సాగించవచ్చు. ఆ తర్వాత గుర్తింపు కార్డును ఉంచుకోవాలి. బస్సు ఎక్కిన ప్రతిసారీ కార్డును కండక్టర్‌కి చూపించాలి.  

కండక్టర్ జీరో టికెట్ ఇస్తారు. జీరో టికెట్ అంటే.. అమౌంట్ ఏదీ రాసి ఉండదు. ఉచితంగానే ఇస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలు కూడా ఉండవు.  

తెలంగాణ సరిహద్దు లోపల ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. సరిహద్దు దాటితే ఎక్స్‌ట్రా దూరానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.  

తెలంగాణలో మొత్తం 7929 బస్సుల్లో ఈ సౌకర్యం ఉండనుంది.. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణలో మొదటి పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నారు.