Surya Kumar Yadav: ఫుల్ టైం కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఎంట్రీ అదిరిపోయింది. శ్రీలంకతో మూడు మ్యాచుల సిరీస్ లో సారధిగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాడు. బ్యాటర్ గా తన మార్క్ చూపించాడు. బౌలర్ గాను బాధ్యతలు పంచుకున్నాడు. ఒత్తిడిలో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఆతిధ్య జట్టుకు ముచ్చమటలు పట్టించారు. టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాను అద్భుత క్యాచ్ తో దెబ్బకొట్టిన సూర్య ఈసారి తనది మాస్టర్ మైండ్ అనిపించుకున్నాడు. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన శ్రీలంకను ఓ ఆట ఆడుకున్నాడు. ప్రత్యర్థుల బ్యాటర్లు ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు. అప్పటికప్పుడు గేమ్ ప్లాన్ ను మార్చేసుకుని సక్సెస్ అయ్యాడు. Surya Kumar Yadav
100 crore offer to Surya Kumar Yadav in IPL 2025
12 బంతుల్లో శ్రీలంక తొమ్మిది పరుగులు చేయాల్సిన దశలో ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న రింకూతో బౌలింగ్ చేయించాడు. మామూలుగా అయితే చివరి రెండు ఓవర్లలో 9 పరుగులు చేయకుండా కట్టడి చేయడం కష్టం. కానీ సూర్య కుమార్ యాదవ్ తెలివిగా వ్యవహరించాడు. రెగ్యులర్ గా బౌలింగ్ చేయని రింకును ప్రయోగించాడు. దీంతో అద్భుతమే జరిగింది. టీమిండియా విజయానికి అసలు అవకాశాలే లేవనుకున్న సమయంలో రింకు సింగ్ వావ్ అనిపించాడు. మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. Surya Kumar Yadav
Also Read: Gautam Gambhir: సిక్సుల వీరులతో బౌలింగ్.. గంభీర్ కోచింగ్ స్టయిల్ అదుర్స్
రెండు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. ఆఖరి ఓవర్లలో లంకకు కావాల్సింది ఆరు పరుగులే. ఫైనల్ ఓవర్ ను రెగ్యులర్ బౌలర్ వేస్తాడని అంతా అనుకున్నారు కానీ అందరి అంచనాలకు భిన్నంగా సూర్యకుమార్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు బ్యాట్ తో బాధడమే తెలిసిన స్కై బంతిని అందుకున్నాడు. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు సొంత ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. ఆఖరి ఓవర్లో సూర్య చురుగ్గా నిర్ణయాలు తీసుకున్నాడు. లంకను కట్టడి చేశారు. ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండు వికెట్లు తీశాడు. Surya Kumar Yadav
దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్ళింది. సూపర్ ఓవర్ లో మాత్రం వాషింగ్టన్ సుందర్ తో బౌలింగ్ చేయించాడు. ఆ తర్వాత తానే స్వయంగా బ్యాటింగ్ కు దిగాడు. బౌండరీ కొట్టి భారత జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీని అందించారు. సూర్య కెప్టెన్సీపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. స్కై మ్యాన్ బుర్రే బుర్ర అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కొందరు సూపర్ మ్యాన్ అంటుంటే…. మరికొందరు స్కై మాన్ అని ప్రశంసిస్తున్నారు. మొత్తంగా కెప్టెన్ గా సూర్య బలంగా అడుగులు వేశారు. ముందు ముందు ఎలా రాణిస్తాడు అన్నదే ఇప్పుడు కీలకం. అంతే కాదు ఐపీఎల్ 2025 వేలంలో 100 కోట్ల వరకు సూర్య పలుకుతాడని అంటున్నారు. Surya Kumar Yadav