20 Years Of Sri Anjaneyam: కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా.. ఛార్మి హీరోయిన్ గా..సీనియర్ నటుడు అర్జున్ సార్జా కీలక పాత్రలో నటించిన శ్రీ ఆంజనేయం సినిమా అందరూ చూసే ఉంటారు. నితిన్ ఆంజనేయుడి భక్తుడిగా అర్జున్ సార్జా ఆంజనేయుడిగా నటించిన ఈ సోషియో ఫాంటసీ సినిమా భారీ అంచనాల మధ్య 2004 జూలై 24న విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చార్మి నటించింది.
20 Years Of Sri Anjaneyam: The actress who missed the heroine chance
ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ చార్మి ఎక్స్పోజింగ్ ఎక్కువ చేసి ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. అయితే ఈ సినిమాలో ముందుగా మరో హీరోయిన్ ని తీసుకున్నారట.కానీ ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉందని ఆమె దీన్ని రిజెక్ట్ చేసిందట ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్. (20 Years Of Sri Anjaneyam)
Also Read: 22 Years Of Indra: ఇంద్ర మూవీలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న అన్ లక్కీ బ్యూటీ..?
గంగోత్రి వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన అదితి అగర్వాల్ ఆ తర్వాత నాలుగైదు సినిమాలకే పరిమితమైంది.ఇక శ్రీ ఆంజనేయం సినిమాలో ముందుగా అవకాశం అదితి అగర్వాల్ నే వరించిందట. కొద్దిమేర షూటింగ్ కూడా జరిగాక సినిమాలో ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించలేనని, మరీ ఇంత బోల్డ్ నావల్ల కాదు అంటూ రిజెక్ట్ చేసిందట.
అంతేకాదు కొంచెం షూటింగ్ జరపడంతో నిర్మాతకి లాస్ వస్తుందని చెప్పినప్పటికీ వినకుండా ఏకంగా దర్శకుడు కృష్ణ వంశీ తోనే గొడవ పడిందట.ఇక ఈ గొడవల కారణంగా అదితి అగర్వాల్ ని తీసేసి చార్మి కౌర్ ని పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ చార్మి అందం మాత్రం అందరిని అట్రాక్ట్ చేసింది దాంతో ఈమెకు ఆఫర్స్ వచ్చాయి.(20 Years Of Sri Anjaneyam)