Pushpa 2: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ మూవీ 2021 లో వచ్చిన పుష్పాకి సీక్వెల్. అప్పట్లో ఈ చిత్రం ఏ విధమైన కలెక్షన్స్ నమోదు చేసిందో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీకి గాను అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు సైతం దక్కింది.

Allu Arjun Pushpa 2 postponed

ఇక ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఇక ఇప్పటికే ఈ మూవీ సీక్వెల్ నుంచి విడుదలైన పోస్టర్స్ అండ్ సాంగ్స్ మరియు టీజర్ భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన సూసైటి అగ్గి రవ్వ సాంగ్ మూవీ పై మరిన్ని హైప్స్ పెంచింది.

Also Read: Mango: పచ్చి మామిడి తో ఈ విధంగా చేస్తే.. మెరిసే చర్మం మీ సొంతం..!

ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 15న గ్రాండ్గా థియేటర్లలో విడుదల చైన్ ఉన్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీ ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా పుష్ప 2 కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Allu Arjun Pushpa 2 postponed

ఫిలిం ఎడిటర్ తో పాటు విఎఫ్ఎక్స్ పై సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. అలాగే పుష్పాకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.(Pushpa 2)