రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) లాంటి భారీ తారాగణం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి కూడా క్లారిటీలు కోరుకుంటున్నారు.

అయితే ఈ సినిమా ఈవెంట్ ఒకటి ముంబై లో ఉంటుంది అని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై మేకర్స్ అఫీషియల్ గా క్లారిటీ అందించారు. కల్కి ప్రీ రిలీజ్ చాప్టర్ ముంబై అంటూ ఈరోజు సాయంత్రం 6 గంటలకి గ్రాండ్ ఈవెంట్ జరగబోతున్నట్టుగా రివీల్ చేశారు. అలాగే ఈ ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుంచి ఉంటుంది అన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి ఇక్కడ చాప్టర్ అని పెట్టారు అంటే మరిన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లు వరుసగా రాబోతున్నాయ్ అని అర్ధం చేసుకోవచ్చు. ఇక వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

Team #Kalki2898AD arrives in Mumbai for a grand pre-release event!!!

???? Today from 6PM onwards.

Stay tuned: https://t.co/m9J7LVNbPp@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobalpic.twitter.com/6dBvFHnsmv

— Kalki 2898 AD (@Kalki2898AD) June 19, 2024

The post లేటెస్ట్: “కల్కి” ప్రీరిలీజ్ లో మొదటి చాప్టర్ వేదిక సమయం లాక్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.