Abhishek Bachchan: అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ తండ్రి లాగే సినిమాల్లో అలాగే బిజినెస్ లలో కూడా రాణిస్తున్నారు. ఈయన సినిమాల్లో స్టార్ అవ్వడమే కాకుండా ప్రో కబడ్డీ లీగ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ టీం ఓనర్ గా కూడా అభిషేక్ బచ్చన్ వ్యవహరిస్తున్నారు.అయితే అలాంటి అభిషేక్ బచ్చన్ తాజాగా 6 ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్లను ఒకేసారి కొని బాలీవుడ్లో సంచలనం సృష్టించారు.

Abhishek Bachchan Bought 6 luxury apartments at once

అయితే ఎవరైనా సెలబ్రిటీలు ఏదైనా కొనాల్సి వస్తే ఒక అపార్ట్మెంట్ లేదా రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తారు.కానీ అభిషేక్ బచ్చన్ మాత్రం ఒకేసారి ఆరు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసి బీ టౌన్ లో వైరల్ గా నిలిచారు.ప్రస్తుతం బీటౌన్ లో అభిషేక్ బచ్చన్ పేరు వైరల్ గా మారింది. ఇక అభిషేక్ బచ్చన్ అపార్ట్మెంట్లు ఎక్కడ కొనుగోలు చేశారు అనేది చూస్తే.. (Abhishek Bachchan )

Also Read: Heroine: మోడీతో డేటిం**.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్..!

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తాజాగా ముంబైలో ఉండే బొరివాలి సబర్చన్ ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ల ను కొనుగోలు చేశారట.ఇక ఈ అపార్ట్మెంట్స్ ఒబెరాయ్ రియాల్టీ అనే రియలెస్టేట్ సంస్థ ఇంక్లైన్ రియాల్టీ దగ్గర ఆరు అపార్ట్మెంట్లను అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.ఇక ఈ ఒబెరాయ్ స్కై సిటీ ప్రాజెక్టుని ఇంక్లైన్ రియాల్టీ సంస్థ వాళ్ళు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో ఉన్న 57 వ అంతస్తులో ఉండే రెండు చిన్న అపార్ట్మెంట్స్ నాలుగు పెద్ద అపార్ట్మెంట్లను అభిషేక్ బచ్చన్ గత నెల 28న తీసుకున్నారు.

Abhishek Bachchan Bought 6 luxury apartments at once

అలాగే 29న రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందట.ఇక పెద్ద అపార్ట్మెంట్స్ విస్తీర్ణం 4984 చదరపు అడుగులు ఉండగా, రెండు చిన్న అపార్ట్మెంట్స్ విస్తీర్ణం 252 చదరపు అడుగుల ఉంటాయట.ఇక ఈ ఆరు లగ్జరీ అపార్ట్మెంట్స్ ని దాదాపు 15.42 కోట్లు ఖర్చు చేసి కొన్నట్టు బీటౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఇవి నిజమేనా లేదా రూమర్సా అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ విషయంపై ఆ రియల్ ఎస్టేట్ సంస్థ గాని అభిషేక్ బచ్చన్ గాని స్పందించలేదు.(Abhishek Bachchan )