Karthi: కోలీవుడ్ నటుడు కార్తీ అంటే అందరికీ తెలుసు. ఈయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు. అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సూర్య ఫ్యామిలీ నుండి కార్తీ కూడా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఈయన కూడా సౌత్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే అలాంటి కార్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వదిన హీరోయిన్ జ్యోతిక గురించి సంచలన విషయాలు బయట పెట్టారు.

Karthi sensational comments on Jyothika

అయితే గత కొద్దిరోజుల నుండి కోలీవుడ్ మీడియాలో జ్యోతిక వల్ల సూర్య ఫ్యామిలీ విడిపోయినట్టు ఎన్నో వార్తలు రాసుకోస్తున్నారు. అయితే ఈ రూమర్స్ అన్నింటి పై కార్తీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.కార్తీ స్పందిస్తూ.. మా వదిన వల్ల కుటుంబం విడిపోయింది..ముక్కలు అయిపోయింది.. అంటూ ఏవేవో రాస్తున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.(Karthi)

Also Read: Heroine: మోడీతో డేటిం**.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్..!

నిజం చెప్పాలంటే మా వదిన ఉన్నప్పుడే మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. ఏ అవసరం వచ్చినా అందరి అవసరాలు తీర్చేది. మా వదిన లేకపోతే అసలు ఇంట్లో ఉండ బుద్ధి కావడం లేదు.ఆమె లేక ఇల్లంతా బోసిపోయింది.కానీ ఏం చేయగలం ప్రస్తుతం పిల్లలు పెద్దవ్వడంతో అన్నయ్య వదిన ఇద్దరు పిల్లల చదువుల కోసం ముంబైకి వెళ్ళిపోయారు.

Karthi sensational comments on Jyothika

ఇన్ని రోజులు మా ఫ్యామిలీ అంతా బాగా కలిసి ఉన్నారంటే దానికి ప్రధాన కారణం మా వదినే అంటూ కార్తీ జ్యోతిక గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఇక కార్తీ స్పందించిన తీరుతో సూర్య ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని, జ్యోతిక వల్ల ఇంట్లో ఎలాంటి విభేదాలు రాలేదని స్పష్టమైపోయింది.(Karthi)