Laya: వేణు తొట్టెంపూడి హీరోగా వచ్చిన స్వయంవరం మూవీ తో టాలీవుడ్ లో ఒక్కసారి గా టాప్ ప్లేస్ లోకి వెళ్లి పోయింది హీరోయిన్ లయ.అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ నితిన్ హీరోగా చేస్తున్న తమ్ముడు అనే మూవీ తో తెలుగులోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.అయితే లయ రీ ఎంట్రి నేపథ్యంలో లయ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కొక్కటిగా మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Laya who went to marriage with that hero but at the end

అయితే హీరోయిన్ లయ ఎన్ఆర్ఐ డాక్టర్ గణేష్ ని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది.కానీ డాక్టర్ కంటే ముందే లయ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోని పెళ్లి చేసుకోవాల్సిందట.అయితే ఇది రూమర్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ విషయాన్ని స్వయంగా లయ పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.(Laya)

Also Read: మహేష్ గొప్ప మనసు.. తన అభిమాని కుటుంబాన్ని దత్తత

ఇక లయ పెళ్లి చేసుకోవాల్సిన హీరో అంటే అందరికీ గుర్తు వచ్చేది నటుడు సాయికిరణ్ మాత్రమే. వెండితెర పై ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా చేసిన సాయికిరణ్ ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ లో చేస్తున్నారు. అయితే ఈ హీరో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను లయ ప్రేమించుకున్నది నిజమే.అలాగే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ విధి మా ఇద్దరిని కలపాలను కోలేదు.

Laya who went to marriage with that hero but at the end

ఎందుకంటే అప్పట్లో మా పెళ్లి చేయాలని పెద్దవాళ్లు అనుకున్న సమయంలో జాతకాలు చూపించారు. మా దురదృష్టం ఏంటంటే..మా ఇద్దరి జాతకాలు కలవలేదు.దాంతో జాతకాలను ఎక్కువగా నమ్మే మా కుటుంబం లయ తో నా పెళ్లికి ఒప్పుకోలేదు.అలా లయ నేను పెళ్లి చేసుకోలేకపోయాం..అంటూ సాయికిరణ్ చెప్పారు. అలా జాతకాల పిచ్చి కారణంగా హీరోయిన్ లయ సాయికిరణ్ తో పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ చెప్పేసిందట.(Laya)