Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార తాను నటించిన మూవీ పై షాకింగ్ కామెంట్లు చేసింది. అయితే ఈమె నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సూపర్ హిట్ అయింది.అలాంటి ఈ మూవీలో నటించి పెద్ద తప్పు చేశానని, అదో చెత్త నిర్ణయం అంటూ నయనతార చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్లో దుమారం సృష్టించాయి. మరి ఇంతకీ నయనతార ఏ సినిమాని నిందించింది అనేది చూద్దాం.

Nayanthara shocking comments on blockbuster movie

నయనతార, అసిన్ ఇద్దరు హీరోయిన్లుగా సూర్య హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ గజినీ.ఈ సినిమా ఎంతోమంది హీరోలు రిజెక్ట్ చేయగా చివరికి సూర్య ఓకే చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. అలాగే ఈ సినిమాని హిందీలో అమీర్ ఖాన్ తో తియగా అక్కడ కూడా హిట్ అయింది.ఇక ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా అసిన్ నటించగా సెకండ్ హీరోయిన్ గా నయనతార చేసింది.(Nayanthara )

Also Read: “హను మాన్” మ్యూజిక్ ఎఫెక్ట్స్.. అతడి నుంచి ఆ ట్రీట్ రాబోతోందా?

అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. గజిని సినిమా స్టోరీ చెప్పేటప్పుడు ఒకవిధంగా తర్వాత చూపించేటప్పుడు మరో విధంగా ఉంది. అయితే ఈ సినిమాలో నటించడం నేను తీసుకున్న చెత్త నిర్ణయం. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎవరిని నిందించాలి అనుకోవడం లేదు. ఎందుకంటే దీన్ని ఒక గుణపాఠంగా స్వీకరిస్తాను అంటూ చెప్పింది.

Nayanthara shocking comments on blockbuster movie

అయితే ఈ విషయంపై మురగదాస్ ఓ పోయి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఈ సినిమా కోసం ఎవరి పాత్రను స్పెషల్గా రాయలేదు. కొన్ని కొన్ని సార్లు పెద్దపెద్ద హీరోయిన్లకు కూడా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉండే పాత్రలు రాయాల్సి వస్తుంది.అది మన చేతుల్లో ఉండదు కదా అంటూ చెప్పారు.అలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా గురించి నయనతార మాట్లాడిన మాటలు కోలీవుడ్లో సంచలనం గా మారాయి.(Nayanthara )