Pawan Kalyan: చిరంజీవి మాజీ అల్లుడు అనగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తాజాగా ఊపిరితిత్తుల సమస్య కారణంగా మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన మరణంతో ఈయన గురించి ఎన్నో విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అలాగే శ్రీజని పెళ్లి చేసుకున్న సమయంలో మెగా ఫ్యామిలీ నుండి ఆయనకు ఎదురైన ఇబ్బందులు శ్రీజ మాట్లాడిన మాటలు ఎన్నో మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీజ శిరీష్ భరద్వాజ్ ల పెళ్లి జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారట.మరి ఆయన ఏం చేశారంటే..

Pawan Kalyan what did after marrying Srija Shirish

శ్రీజ కేవలం 19 ఏళ్ల వయసులోనే శిరీష్ భరద్వాజ్ అనే 22 ఏళ్ల అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కూడా ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆర్య సమాజ్లో చేసుకుంది.అయితే పెళ్లయ్యే సమయానికి శ్రీజ కి ఏది తప్పు ఏది ఒప్పు అననే సరైన పరిజ్ఞానం కూడా లేదు. ఏమీ తెలియని చిన్న ఏజ్ లో శిరీష్ ని పెళ్లి చేసుకొని మీడియా ముందుకు వచ్చి నా తల్లిదండ్రుల నుండి నా భర్త ఫ్యామిలీకి, నాకు, నా భర్తకు సెక్యూరిటీ కావాలి అంటూ చెప్పింది.(Pawan Kalyan)

Also Read: కెవ్వు కేక కాంబినేషన్ లో మరోసారి హరీష్ శంకర్ పోస్ట్ వైరల్

ఇక శ్రీజ ఆ రోజు మాట్లాడిన మాటలకు చిరంజీవి గుండె పగిలినంత పని అయిపోయింది. మెగా ఫ్యాన్స్ అయితే శ్రీజ్ చేసిన పనికి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నుండి తనకు రక్షణ కావాలని కోరిందో ఆ సమయంలోనే చిరంజీవి పెద్ద మనసుతో నా కూతుర్ని ఆశీర్వదిస్తున్నాను అని మీడియా ముఖంగా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ శ్రీజ అన్న మాటలకి తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్ ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అలా శ్రీజ పెళ్లి చేసుకున్న సమయంలో ఎన్నో సంచలనాలు జరిగాయి.

Pawan Kalyan what did after marrying Srija Shirish

కానీ చివరికి శిరీష్ భరద్వాజ్ తో చివరిదాకా జీవితాన్ని కొనసాగించలేకపోయింది శ్రీజ. ఒక పాప పుట్టాక ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. శ్రీజని శిరీష్ భరద్వాజ్ తండ్రి దగ్గర నుండి కట్నం తేవాలి అని వేధించడంతో తాను ఫ్యామిలీని కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు తనకు తగిన శాస్త్రి జరిగిందని భావించి కోర్టులో కేసు వేసి శిరీష్ కి విడాకులు ఇచ్చి తండ్రి చెంతకు చేరింది. ఇక విడాకుల తర్వాత శిరీష్ విహాన అనే డాక్టర్ని రెండో పెళ్లి చేసుకోగా శ్రీజ కూడా ఇంట్లో వాళ్ళు చూసిన కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకొని ఆయనకు కూడా విడాకులు ఇచ్చింది.(Pawan Kalyan)