Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో… కొత్త విషయం తెరపైకి వచ్చింది. అదే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి… వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విజయం సాధించడానికి ముఖ్య కారకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అలాంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి కేంద్రంలో ఎలాంటి పదవి రాలేదు.

Big shock for megastar Chiranjeevi Modi government

తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికీ అలాగే బిజెపి నుంచి ఒక్కరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇద్దరు ఎంపీలు ఉన్న జనసేన పార్టీకి మాత్రం… ఒక పదవికి కూడా రాలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి కోసమే జనసేన పార్టీకి ఎలాంటి పదవి నరేంద్ర మోడీ ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది. అతి త్వరలోనే రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవిని పంపించి… ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా చిరంజీవిని చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Nayanthara: అదో చెత్త సినిమా.. చేసి తప్పు చేసా.. బ్లాక్ బస్టర్ మూవీ పై నయనతార షాకింగ్ కామెంట్స్..!

అయితే ఈ తతంగం అంతా ఇప్పుడే జరగకుండా… ఓ ఏడాది కాలం అయిన తర్వాత… నిర్వహించనున్నారట నరేంద్ర మోడీ. ఇందులో భాగంగానే మొన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా… చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ తో చర్చించారట ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడు ఇదే అంశం అందరూ చర్చించుకుంటున్నారు. ఏపీలో తెలుగుదేశం కూటమి విజయానికి కారణమైన పవన్ కళ్యాణ్ కుటుంబంలో… మెగాస్టార్ చిరంజీవికి పదవి ఇస్తే.. పవన్ కళ్యాణ్ కూడా కాస్త సంతృప్తి చెందే ఛాన్స్ ఉంది. అలాగే ఏపీలో… కాపు ఓటర్లను కూడా తమ వైపునకు తిప్పుకునేందుకు బిజెపి ఇలా స్కెచ్ వేసిందని అంటున్నారు. అయితే… ఇదే అంశంపై మెగాస్టార్ కూతురు సుస్మిత తాజాగా స్పందించారు.

అసలు చిరంజీవికి ఎలాంటి పదవి ఇస్తానని చెప్పలేదని…. అవి కట్టు కథలు మాత్రమే అని తేల్చి చెప్పారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుస్మిత… ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాబాయ్ విజయాన్ని కుటుంబం మొత్తం ఎంజాయ్ చేస్తోందని తెలిపారు. ఇంట్లో అసలు రాజకీయాల గురించి ప్రస్తావించారని.. ఆమె వెల్లడించారు. ఇక చిరంజీవి గారి పదవి గురించి ఎక్కడా కూడా ప్రస్తావన రాలేదని… వస్తే అప్పుడు ఆలోచిస్తామని ఆమె తెలిపారు. దీంతో చిరంజీవికి మోడీ ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లే అని మరి కొంత మంది మెగా ఫ్యాన్స్ అంటున్నారు.