Tollywood: టాలీవుడ్ లో ఇప్పుడు తెరకెక్కే సినిమా ల పరిస్థితి వేరే లెవెల్ లో ఉన్నాయి. బాహుబలి తర్వాత ఎన్నో సినిమా లు భారీ స్కేల్ లో తెరకెక్కి ఇండియన్ సినిమా స్థాయి ని పెంచాయి. ఆ విధంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో కూడా భారీ సినిమా రాబోతున్నాయి. అలా ఇప్పుడు మారిన విడుదల తేదీలను బట్టి రాబోతున్న పెద్ద బడా హీరోల సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Tollywood Big Movies Releasing This Year

ఈ నెలలో ఆఖరులో అందరు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి. భారతీయ వెండితెరపై ఇదొక కొత్త ప్రయోగం అని తెలియాలి. ఆ విధంగా ఈ సినిమా పై ప్రేక్షకులను ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 27 న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె వంటి భారీ తారాగణం నటిస్తుండగా ప్రభాస్ కెరీర్ లో ఇది పెద్ద మైలురాయి అయ్యే అవకాశాలు కనిపిస్తుంది.

Also Read: Nayanthara: అదో చెత్త సినిమా.. చేసి తప్పు చేసా.. బ్లాక్ బస్టర్ మూవీ పై నయనతార షాకింగ్ కామెంట్స్..!

ఇక ఈ సినిమా తర్వాత ఆగస్టు 15 న పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ సినిమా రాబోతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా పై అందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర సినిమా కూడా సెప్టెంబర్ లో రాబోతుంది. సెప్టెంబర్ 27 న రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అక్టోబర్ లో నాని హీరో గా నటించిన సరిపోదా శనివారం రాబోతుంది.(Tollywood)

ఇక డిసెంబర్ లో పుష్ప 2 సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. పలు కారణాల వల్ల వాయిదా పడగా అల్లు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి రిలీజ్ డేట్ స్పష్టత కూడా వచ్చింది. ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కూడా నవంబర్ లో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా పలువురు టాలీవుడ్ టాప్ హీరో ల సినిమాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.