Matka: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొన్ని రోజులుగా విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ కి ప్రతినిధిగా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. కాగా వారి కష్టానికి ఫలితం దొరికింది. ప్రస్తుతం వరుణ్ తన సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు. అయన హీరో గా నటిస్తున్న “మట్కా” సినిమా ను తొందరలోనే మొదలుపెట్టనున్నాడు.

Varun Tej New Movie Matka Update

ఈ సినిమా 1960-1980ల నాటి కథ అని తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సన్నివేశాలపై, సెట్స్ పై టీమ్ చాలా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణలో కొంత భాగం పూర్తయింది. అయితే కొత్త షెడ్యూల్ కోసం చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇందులో వరుణ్ తేజ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. వరుణ్ సహా ప్రధాన నటీనటులందరూ ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సినిమా లో వరుణ్‌ కనిపించే తీరు మాత్రం భిన్నంగా ఉంది. రెట్రో మ్యూజిక్ తో వరుణ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది.

Also Read: Tollywood: మారిన సినిమా రిలీజ్ లు.. ఈ సంవత్సరం రాబోయే బడా సినిమాలివే!!

అందుకు సంబంధించిన పోస్టర్లు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ 4 విభిన్నమైన దుస్తుల్లో కనిపించనున్నాడు. “గద్దల కొండ గణేష్”లో వరుణ్ తేజ్ రగ్గడ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేసిన సినిమాలలోనూ వెరైటీ లుక్స్ కనిపించేలా చేసిన వరుణ్ ఈ సినిమా తో ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరిస్తారో చూడాలి.