Diljit Dosanjh: కల్కి 2898AD అనే భారీ పాన్ ఇండియా మూవీ ద్వారా ఎంతోమంది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం కల్కి సినిమాకు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ భారీ పాన్ ఇండియా మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతుండడంతో ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.

What is the price of Kalki Singer Diljit Dosanjh diamond watch

ఇక తాజాగా ముంబైలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు చిత్ర యూనిట్.అయితే తాజాగా ఈ సినిమాకి భైరవ యాంథెమ్ పాడిన పంజాబీ సింగర్ దిల్జిత్ దోసంజ్ కు సంబంధించి ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదేంటంటే దిల్జిత్ దోసంజ్ రీసెంట్ గా జిమ్మీపాలన్ ది టు నైట్ అనే ఈవెంట్లో పాల్గొన్నారు. (Diljit Dosanjh)

Also Read: Balakrishna: బాలయ్య సినిమాలకు అడ్డొస్తున్న పొలిటికల్ కెరీర్!!

ఈ ఈవెంట్ లో దిల్జిత్ దోసంజ్ తన చేతికి పెట్టుకున్న డైమండ్ వాచ్ ధర నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే చాలామంది సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా కొత్త వస్తువు లేదా కొత్త డ్రెస్ ఏదైనా సరే అభిమానులకు కనిపించింది అంటే చాలు దాని ధర ఎంత ఉంటుందబ్బా అని నేటిజన్స్ ఆరా తీయడం మొదలు పెడతారు. అయితే రీసెంట్గా దిల్జిత్ దోసంజ్ తన చేతికి పెట్టుకున్న ఆ 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ లింకులతో కూడిన స్టీల్ స్టెయిన్ లెస్ బ్రేస్ లేట్ గా ఉన్న ఈ వాచ్ ధర ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

What is the price of Kalki Singer Diljit Dosanjh diamond watch

ఆ వాచ్ ధర లక్షల్లో ఉంది అనుకుంటే పొరపాటు పడ్డట్లే.ఎందుకంటే దాని ధర అక్షరాల1.2 కోట్లనీ తెలుస్తోంది.ఇక జిమ్మీపాలన్ ది టు నైట్ ఈవెంట్ లో దిల్జిత్ దోసంజ్ తన పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు. ఇక ఇందులో భాగంగా ఆయన పాట పాడే సమయంలో ఆయన చేతికి పెట్టుకున్న డైమండ్ వాచ్ అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.(Diljit Dosanjh )