Amitabh Bachchan: పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో దీపిక పదుకొనే అండ్ దిశా పటాన్ని హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Amitabh Bachchan who planted his legs as a producer

కాగా అమితాబచ్చన్ మరియు కమల్హాసన్ అండ్ రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ మేరకు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో గ్రాండ్గా నిర్వహించారు.

Alson Read:Diljit Dosanjh: కల్కి సింగర్ చేతికున్న డైమండ్ వాచ్ తో లగ్జరీ ఇల్లు కొనచ్చు.. ధర ఎంతంటే.?

ఈ ఈవెంట్ కు అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అండ్ ప్రభాస్ తో పాటు నిర్మాత అశ్విని దత్ కూడా హాజరయ్యారు. ఇక దగ్గుపాటి రానా ఈ ఈవెంట్ కి హోస్టుగా వ్యవహరించాడు. కల్కి మూవీకి సంబంధించిన బిగ్ టికెట్ లాంచ్ చేసిన అనంతరం దాన్ని స్వయంగా అమితాబచ్చన్ కొనుగోలు చేశాడు.

Amitabh Bachchan who planted his legs as a producer

ఆ తర్వాత దాన్ని కమల్ హాసన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ క్రమంలోనే అమితాబచ్చన్ కల్కి నిర్మాత అశ్విని దత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతూ ఆయన కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. ఇక ఆ వెంటనే అశ్వినీ దత్ వెనక్కి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Amitabh Bachchan)