Deepika Padukone: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరైన దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Interesting post by Deepika Padukone

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ ద్వారంలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. అటు సినిమాలు చేస్తూనే ఇటు తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదిస్తుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన బేబీ బంప్ తో ఫొటోస్ షేర్ చేస్తుంది.

Also Read: Kalki 2898 AD: నాగ్ అశ్విన్ పాటిస్తున్న జక్కన్న ఫార్ములా ఫలించేనా!!

ఇక ఈ క్రమంలోనే తాజాగా దీపిక పదుకొనే బేబీ బంప్ తో ఫోటోలు షేర్ చేసింది. అంతేకాకుండా..” సరే చాలు.. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది ” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రెసెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది.

Interesting post by Deepika Padukone

కాగా ప్రస్తుతం దీపికా పదుకొనే కల్కి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీని నాగ్ అశ్విన్ రూపొందించారు. ఇక ఇందులో అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్ మరియు దిశ పటానికి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది.(Deepika Padukone)