Sri Reddy: బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి ఎప్పుడు ఏదో ఒక విషయంలో మీడియాలో దుమారం సృష్టిస్తూనే ఉంటుంది.మరీ ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలి అని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలామంది చేతుల్లో మోసపోయానని, దగ్గుబాటి అభిరామ్ నాకు సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని చెప్పి పూర్తిగా వాడుకొని వదిలేసాడంటూ ఇలా ఎన్నో ఆరోపణలు చేసింది.అలాగే మెగా ఫ్యామిలీ పై,హీరో నాని పై ఈమె ఎన్నో ఆరోపణలు చేసింది.

Sri Reddy love with YCP politician marriage soon

ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియదు. కానీ దగ్గుబాటి అభిరామ్ తో శ్రీరెడ్డి దిగిన ఫొటోస్ మాత్రం మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే జనసేన,టిడిపిని ట్రోలింగ్ చేస్తూ వైసిపి పార్టీకి సపోర్ట్ గా ఉంటున్న నటి శ్రీరెడ్డి గురించి తాజాగా ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే శ్రీరెడ్డి వైసిపి పార్టీలో కొనసాగుతున్నా ఆ యువ రాజకీయ నాయకుడిని పెళ్లాడబోతున్నట్టు తెలుస్తోంది. (Sri Reddy)

Also Read: Tollywood: పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా?.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అండోయ్.!

అంతేకాదు ఆ రాజకీయ నాయకుడితో గత కొద్ది రోజులుగా శ్రీరెడ్డి సహజీవనం చేస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. వైసిపి పార్టీలో ఉండే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ఎంత ఫేమసో చెప్పనక్కర్లేదు.అయితే సిద్ధార్థ్ రెడ్డి తో శ్రీరెడ్డి రిలేషన్ లో ఉందని, వీరిద్దరూ చెన్నైలో రహస్యంగా సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది.అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది.

Sri Reddy love with YCP politician  marriage soon

అయితే వైరల్ అయ్యే ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రీసెంట్ గా సోషల్ మీడియాలో వ్యక్తి ట్రోల్ చేయగా సిద్ధార్థ్ రెడ్డికి చెబితే నీ చేయి విరిచేస్తాడు అంటూ ఆ వ్యక్తికి కౌంటర్ ఇచ్చేసరికి సిద్ధార్థ్ రెడ్డికి, శ్రీ రెడ్డికి మధ్య నిజంగానే రిలేషన్ ఉందా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.(Sri Reddy)