Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు చిరు. ఇక ప్రశ్నల కాలంలో కూడా వయసు మీద పడినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే యండమూరి వీరేంద్రనాథ్ గురించి మనందరికీ తెలిసిందే.

Chiranjeevi fired at the writer

ఆయన డైరెక్టర్ గా, రైటర్ గా మరియు నిర్మాతగా పలు అవతారాలు ఎత్తి మంచి సక్సెస్ అందుకున్నారు. మరీ ముఖ్యంగా ఆయన చేసిన నవలల ఆధారంగా ఎన్నో సినిమాలు రూపొందాయి. ఇక ఇందులో కొన్ని మూవీస్ మెగాస్టార్ చిరంజీవి కి బ్లాక్ బస్టర్ హిట్ను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే వీరేంద్రనాథ్, చిరంజీవి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే వీరేంద్రనాథ్ ఒకానొక సమయంలో రాంచరణ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

Also Read: Pavitra: హీరోయిన్ల కంటే అందంగా పవిత్ర గౌడ కూతురు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

దాదాపు 8 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లాలోనివో కళాశాలలో నిర్వహించిన ఈవెంట్ కు వీరేంద్ర ప్రసాద్ అండ్ చిరంజీవి ముఖ్య అతిథులుగా వెళ్లారు. అక్కడ వీరేంద్ర చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గురించి షాపింగ్ కామెంట్స్ చేశారు. ” రామ్ చరణ్ హీరోగా నిలబెట్టేందుకు ఆయన తల్లి సురేఖ ఎంతో కష్టపడింది. డాన్స్లు నేర్పించింది. కానీ అతడి దవడ సరిగ్గా ఉండేది కాదు. తర్వాత రోజుల్లో దానిని సరి చేశారు ” అంటూ చరణ్ పై అనుచిత కామెంట్స్ చేసి.. అదే సమయంలో దేవిశ్రీప్రసాద్ ప్రశంసలు కురిపించారు. ఇక దీంతో మెగా వార్ స్టార్ట్ అయింది.

Chiranjeevi fired at the writer

వీరేంద్ర పై చిరంజీవి అభిమానులు అప్పట్లో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఇక దీనిపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు సైతం వీరేంద్రకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ వివాదం మరింత ముదరడంతో ఆ తర్వాత చిరంజీవి సైతం స్పందించారు. నామీద వచ్చే విమర్శలు నేను పట్టించుకోను. కానీ నాగబాబు తట్టుకోలేడు. కొందరు సంస్కారం లేకుండా మాట్లాడి కించపరిచారు కాబట్టే నాగబాబు అలా రియాక్ట్ అయ్యారని.. అదేవిధంగా తన భార్య సురేఖను కూడా పద్ధతి లేకుండా ఏకవచనంతో పిలవడం కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అయ్యాడు చిరు.(Chiranjeevi)