Nuvvu Naku Nacchav: వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్టైనర్ మూవీ నువ్వు నాకు నచ్చావ్.. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేశారు. అయితే 2001 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది ఆర్తి అగర్వాల్. మొదట్లో ఆర్తి అగర్వాల్ పాత్ర కోసం గజాలా,త్రిష వంటి హీరోయిన్లను అనుకున్నప్పటికీ అప్పటికే బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించిన ఆర్తి అగర్వాల్ ను చూసి హీరోయిన్ గా ఫిక్స్ చేశారట.

Nuvvu Naku Nacchav: Director who shot one scene for 5 months.. Reason

అలా ఆర్తి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా వచ్చి చేరింది.అలాగే ఈ సినిమాకి మొదట తరుణ్ ని హీరో అనుకున్నప్పటికీ కామెడీ కూడా పండించాలి కాబట్టి వెంకటేష్ ని తీసుకున్నారట. అలా ఎన్నో మార్పులు చేర్పులతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని షూట్ చేయడం కోసం దాదాపు 5 నెలలు తీసుకున్నారట డైరెక్టర్ విజయ్ భాస్కర్. (Nuvvu Naku Nacchav)

Also Read: Renu Desai: భర్తతో కలవబోతున్న రేణు దేశాయ్.. పవన్ మూడో భార్య ఒప్పుకుంటుందా..?

ఇక విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ తండ్రిగా ప్రకాష్ రాజ్ చేశారు. ఇక ప్రకాష్ రాజ్ తన తల్లి మీద ప్రేమతో అన్నం తినే సమయంలో ఒక కవిత చెబుతారు. అయితే ఈ కవిత చెప్పే సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర సునీల్, వెంకటేష్, ఆర్తి అగర్వాల్,సుధా,ఎమ్మెస్ నారాయణ, హేమ ఇలా సినిమాలోని కీలక పాత్రలు అందరూ ఉంటారు.అయితే వీరందరితో ఒకేసారి షూట్ తీయాలంటే జరిగే పని కాదు. ఎందుకంటే అప్పటికే వెంకటేష్, ఆర్తి అగర్వాల్ వేరే వేరే సినిమాల్లో బిజీగా ఉన్నారు.

Nuvvu Naku Nacchav: Director who shot one scene for 5 months.. Reason

అలాగే సునీల్, ఎమ్మెస్ నారాయణ, ప్రకాష్ రాజ్ కూడా ఇతర సినిమాల్లో బిజీగా ఉన్నారు.దాంతో డైరెక్టర్ కి అందరితో కలిసి ఈ సీన్ తెరకెక్కించడం కష్టంగా మారింది.అయితే డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఎవరి డేట్స్ దొరికినప్పుడు వారికి సంబంధించిన పాత్రని షూట్ చేశారట. అలా ఈ ఒక్క సన్నివేశాన్ని దాదాపు 5 నెలలు షూట్ చేశారట డైరెక్టర్.ఇక ఈ విషయాన్ని స్వయంగా విజయ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Nuvvu Naku Nacchav)