Suma: ఏంటి సుమ మూడో ప్రెగ్నెన్సా.. వింటుంటే షాకింగ్ గా ఉందే అని మీరందరూ ముక్కున వేలేసుకుంటున్నారా.. మరి ఇంతకీ సుమ తన మూడో ప్రేగ్నెన్సీ గురించి ఏం మాట్లాడింది.ఎలాంటి సీక్రెట్ విషయాన్ని బయట పెట్టింది అనేది ఇప్పుడు చూద్దాం. యాంకర్ గా సుమ అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై రాణిస్తుంది.స్టార్ హీరో హీరోయిన్ల ఆడియో ఫంక్షన్లకి,ప్రీ రిలీజ్ ఈవెంట్లకి పెట్టింది పేరుగా ఉన్న సుమ తెలుగు ఇండస్ట్రీలో ఈమెని పక్కకు నెట్టే యాంకర్ ఇప్పటివరకు రాలేదు అని అంటే అతిశయోక్తి కాదు.

Anchor Suma gave the shocking news about her third pregnancy

అయితే అలాంటి యాంకర్ సుమ కేవలం సినిమా ఈవెంట్లు మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా చాలా షోలలో యాంకరింగ్ చేస్తుంది. అలా ఇప్పటికే స్టార్ మహిళ, భలే ఛాన్స్లే, క్యాష్, సుమ అడ్డా వంటి ఎన్నో బుల్లితెర షోలలో యాంకర్ గా చేసింది. అయితే ప్రస్తుతం యాంకర్ సుమ సుమ అడ్డా అనే షో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ షో కి ఎంతోమంది సినీ ఇండస్ట్రీ జనాలు వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.అలా తాజాగా సీరియల్స్ లో నటించే యాక్టర్స్ ఈ షో కి వచ్చి హడావిడి చేశారు. ఇక ఇందులో భాగంగా ఈ షో కి సీరియల్ యాక్టర్స్ ఈ మధ్యనే పేరెంట్స్ అయిన వారు వచ్చారు. (Suma)

Also Read: Lavanya Tripathi: గ్లామర్ డోస్ ని పెంచిన మెగా కోడలు.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్..!

అయితే వీరి గురించి సుమ మాట్లాడుతూ మీరు రీసెంట్ గా పేరెంట్స్ అయ్యారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువయ్యాయి.మీరు డైపర్స్ మార్చుతూ ఇంకా చాలా చేస్తూ రీల్స్ తీసుకోవచ్చు. అందుకే మిమ్మల్ని చూస్తే నాకు చాలా కుళ్ళుగా ఉంది.మీరు డైపర్ ఇంటిగ్రేషన్ వంటివి చేస్తూ ఉంటే నేనేమో ఇలాంటి గొట్టాలను ఇంటిగ్రేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది అంటూ సుమా ఫన్నీగా చెప్పుకొచ్చింది. అయితే ఈ షోకి వచ్చిన యాక్ట్రెస్ మాట్లాడుతూ..

Anchor Suma gave the shocking news about her third pregnancy

నేను బ్రేక్ తర్వాత ఒక అమ్మాయిని కంటే వాడేమో బ్రేక్ తరువాత ఒక అబ్బాయిని కనేశాడు అదేమో ఒ పాపకు జన్మనిచ్చింది అంటూ మాట్లాడుతుండగా మధ్యలో కలుగజేసుకున్న సుమ ఆగండి మీకో విషయం అర్థం అవుతుందా.. నేను ఇద్దరు పిల్లలతో ఎందుకు ఆపానో.. ఎందుకంటే నాకు మూడో బిడ్డను కనడానికి అసలు బ్రేకే దొరకలేదు అంటూ పంచ్ వేసింది.ఇక దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో సుమ ఇండస్ట్రీలో చాలా బిజీయెస్ట్ యాంకర్.. అందుకే ఈమెకి బ్రేక్ దొరకపోవడంతో మూడో బిడ్డను కనలేదు కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Suma)