Infinix Note 40 5G: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ని విపరీతంగా వాడుతున్నారు. కొంతమంది ఒకటికి మించి రెండు మూడు ఫోన్లనీ వినియోగిస్తున్నారు. ఒకటి ఆఫీస్ అవసరాలకు వినియోగించగా….మరోక దానిని పర్సనల్ అవసరాలకు వాడుతున్నారు. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు చాలా తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి. Infinix Note 40 5G

Infinix Note 40 5G Launched In India With 108 mega fixel

అందుకు గల కారణం ఆయా కంపెనీ దారులు ఎక్కువ విక్రయాలు జరుపుకునేందుకు ఫోన్లను తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Infinix Note 40 5G ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. Infinix Note 40 ఫోన్ లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే సదుపాయం కలదు. ఈ ఫోన్ లో 8 జిబి రామ్ విత్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రూ. 19,999 రూపాయలకు Infinix Note 40 ఫోన్ లభిస్తుంది. Infinix Note 40 5G

Also Read: Vivo T3 Lite 5G: వివో నుంచి బడ్జెట్‌ 5జీ ఫోన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే !

అయితే ఈ ఫోన్ కొనుగోలు చేసే సమయంలో ఏవైనా క్రెడిట్ కార్డులు వాడినట్లయితే రూ. 2వేల రూపాయల డిస్కౌంట్ తో కొనుగోలు చేసుకోవచ్చు. అంటే రూ. 17,999కే Infinix Note 40 ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ ను ఈఎంఐ సదుపాయంలో కూడా కొనుగోలు చేయవచ్చు. Infinix Note 40 ఫోన్ లో ఫోటోలు, వీడియోల కోసం 108 బ్యాక్ కెమెరా, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. Infinix Note 40 5G

Infinix Note 40 ఫోన్ కు 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. అతి తక్కువ సమయంలోనే అంటే కేవలం 20 నిమిషాలలోనే ఈ ఫోన్ చార్జింగ్ ఫుల్ అవుతుంది. ఒక్కసారి చార్జింగ్ పెట్టి 24 గంటలు సులభంగా ఈ ఫోన్ ని వాడవచ్చు. ఇక Infinix Note 40 ఫోన్ ను ఈనెల 26 నుంచి ప్రముఖ ఫ్లాట్ ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. Infinix Note 40 5G