Pawan Kalyan: అంత పెద్ద ధనవంతుడు సినీ హీరో ఒక సినిమా చేస్తే కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ వస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ కి పొలం కొనడానికి డబ్బులు లేక అలాంటి పని చేశారా. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ పొలం కొనడానికి డబ్బులు లేక ఏ పని చేశారో ఇప్పుడు చూద్దాం.

Did Pawan Kalyan do such a thing without money to buy a farm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం,మంత్రి,ఎమ్మెల్యే, సినీ హీరో ఇలా ఈయనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో పొలం కొనడానికి డబ్బులు చాలకపోవడంతో ఒక ప్రకటనలో నటించారట. పవన్ కళ్యాణ్ నటించిన మొదటి చివరి యాడ్ ఏంటంటే కోకోకోలా.. (Pawan Kalyan)

Also Read: Suma: మూడో ప్రెగ్నెన్సీ పై అందరూ షాక్ అయ్యే న్యూస్ చెప్పిన యాంకర్ సుమ.!

ఇక ఈ యాడ్లో నటించడానికి ప్రధాన కారణం ఓ పొలం కొనడానికి డబ్బులు తక్కువ పడిన సమయంలో యాడ్లో పవన్ నటించారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా పవన్ చెప్పారు. అయితే ఈ యాడ్ కంటిన్యూ చేస్తూ నటించవలసిందిగా ఈ కంపెనీ వాళ్ళు కోరగా కోకోకోలా వల్ల దీన్ని తాగేవారికి హానికరం అనే విషయం తెలియడంతో ప్రజలకు హాని కలిగించే పని నేను ఏది చేయను అని పవన్ కళ్యాణ్ అప్పటినుండి యాడ్స్ చేయడం మానేశారట.

Did Pawan Kalyan do such a thing without money to buy a farm

అయితే తనకి ఈ యాడ్ చేసినందుకు స్టార్ హీరోల కంటే 40 లక్షల రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఇచ్చారట. అంతేకాదు మళ్లీ ఆ తర్వాత వివిధ ప్రకటనల్లో నటించడానికి పవన్ కళ్యాణ్ కి ఆఫర్ వచ్చినా కూడా ఎంత డబ్బు ఇస్తామని చెప్పినా కూడా ఆయన రిజెక్ట్ చేశారట.(Pawan Kalyan)