Sonakshi Sinha: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ని తాజాగా అంటే జూన్ 23న ముంబైలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె తన పెళ్లికి తెలుపు రంగు చీరను కట్టుకుంది.అయితే పెళ్లికి అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్యనే పెళ్లి చేసుకున్న జహీర్ ఇక్బాల్ సోనాక్షి సిన్హాలు పెళ్లి చేసుకుంది ఏ ఆచారం అనేది చాలామందికి తెలియదు. అయితే సోనాక్షి సిన్హా పెళ్లి తర్వాత మతం మారుతుంది అనే పుకార్లు కూడా బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Do you know the ceremony of Sonakshi Sinha wedding

ఇక సోనాక్షి తన వివాహాన్ని హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకుందా లేక ముస్లిం ఆచారం ప్రకారం చేసుకుందా అనేది చాలా మందికి తెలియదు. అయితే ఈ రెండు ఆచారాలు కాకుండా సోనాక్షి సిన్హా ఏ ఆచారంలో పెళ్లి చేసుకుందో ఇప్పుడు చూద్దాం. సోనాక్షి సిన్హా పెళ్లిలో ఎన్నో ట్విస్టులు ఇప్పటికే మనం చూసాం. మొదట్లో ఈమె పెళ్లికి సంబంధించి తనకి ఎలాంటి విషయం తెలియదని సోనాక్షి తండ్రి శత్రజ్ఞ చెప్పారు.(Sonakshi Sinha )

Also Read: Abhishek Bachchan: ఎస్ మేం విడాకులు తీసుకుంటున్నాం.. ఫైనల్ గా అసలు విషయం చెప్పిన అభిషేక్ బచ్చన్.!

ఆ తర్వాత కొద్దిరోజులకే సోనాక్షి జహీర్ ని పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవడంతో ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదనే పుకార్లు వినిపించాయి. కానీ ఎట్టకేలకు అలాంటి పుకార్లన్నింటిని కొట్టి పారేశారు. తన కూతురి పెళ్లికి వెళ్లాల్సిన బాధ్యత తనకు ఉంది అని శత్రుఘ్న చెప్పారు. అయితే ముంబైలో పెళ్లి చేసుకున్న ఈ జంట యఏ ఆచారంలో పెళ్లి చేసుకున్నారో మాత్రం చెప్పలేదు.కానీ సోనాక్షి పెళ్లి చేసుకున్న జహీర్ ఇక్బాల్ సోదరుడు ఇక్బాల్ రతాన్సీ ఈ విషయాన్ని వెల్లడించారు.

Do you know the ceremony of Sonakshi Sinha wedding

ఆయన ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోనాక్షి సిన్హా నా సోదరుడు సివిల్ మ్యారేజ్ అకా కోర్టు పద్ధతి లో పెళ్లి చేసుకున్నారు.. అలాగే పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా తన మతం మార్చుకోదు. ఎందుకంటే కులాలు, మతాలను దృష్టిలో పెట్టుకొని ఈ జంట పెళ్లి చేసుకోలేదు. వారి మనసులు దగ్గరయ్యాయి కాబట్టి వారికి కులం మతంతో సంబంధం లేదు అంటూ జహీర్ ఇగ్బాల్ సోదరుడు ఇగ్బాల్ రథాన్సీ క్లారిటీ ఇచ్చారు.(Sonakshi Sinha )