Hardik Pandya: రెండు నెలల క్రితం విలన్ లాగా ఉన్నవాడు ఇప్పుడు హీరో అయిపోయాడు అతడే హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ లో ఏ ముహూర్తాన ముంబై ఇండియన్స్ కు కెప్టెన్సీ తీసుకున్నాడో కానీ అప్పటి నుంచి మన పాండ్యాకు దరిద్రం పట్టుకుంది. రోహిత్ శర్మను అవమానించాడని హిట్ ఫ్యాన్స్ తో పాటు మీడియా కూడా పాండ్యా మీద దుమ్మెత్తిపోశారు. ఇదంతా మౌనంగా భరిస్తున్న సమయంలో పర్సనల్స్ గాను పాండ్యాను ఇబ్బందులు చుట్టుముట్టాయి. తన భార్య విడాకులు కోరుతుందంటూ వచ్చిన వార్తలు పాండ్యా కెరియర్ మీద ప్రభావం చూపిస్తాయేమో అనుకున్నారు చాలామంది. Hardik Pandya

Hardik Pandya utter fluff in IPL but playing for country

కానీ హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ లో రెచ్చిపోతున్నారు. అటు బౌలింగ్ లో అదరగొడుతున్న పాండ్యా ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాటింగ్ లోను రఫ్ఫాడించేస్తున్నారు. ఈ వరల్డ్ కప్ లో పాండ్యా బ్యాటింగ్ చేసింది ఇప్పటివరకు మూడుసార్లు మాత్రమే. మొదట పాకిస్తాన్ లో మ్యాచ్ లో 7 పరుగులకే అవుట్ అయిన ఆఫ్ఘనిస్తాన్ మీద మ్యాచ్ తో 32 పరుగులు చేశాడు. నిన్న బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. Hardik Pandya

Also Read: Virat Kohli: బంగ్లాతో మ్యాచ్‌..బల్లకింద దూరిన విరాట్‌ కోహ్లీ..?

టీం ఇండియా 197 పరుగుల భారీ స్కోరు చేయగలిగిందంటే కారణం పాండ్యా మాత్రమే. అందుకే నిన్న బంగ్లాదేశ్ విక్టరీ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. ఫినిషర్ అయిన పాండ్యాకు బ్యాటింగ్ వచ్చిందంటే టీమ్ ఇండియా టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలాయని అర్థం. అలాంటి కఠినమైన సమయంలో పాండ్యా వరుసగా ఈ రెండు మ్యాచులోనూ చేసిన పరుగులు భారత్ విజయానికి కారణం అయ్యాయి. మరోవైపు బౌలింగ్ లోను పాండ్యా రాణిస్తున్నారు. Hardik Pandya

నిన్న బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో తంజీత్ హసన్, లిటన్ దాస్ చాలా కాన్ఫిడెంట్గా ఆడుతున్న సమయంలో లిటన్ దాస్ ను అవుట్ చేసి భారత్ కు తొలి వికెట్ అందించాడు పాండ్యా. ఇదే కాదు ఐర్లాండ్ మీద మూడు వికెట్లు, పాకిస్తాన్ మీద రెండేసి వికెట్లు తీశాడు. పాండ్యా ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు పాండ్యా ఆడిన మ్యాచుల్లో 8 వికెట్లు తీసి తన ఆల్ రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు. అలా అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో ఇరగదీస్తూ పాండ్యా ఇస్ బ్యాక్ అనిపిస్తున్నాడు మన హార్దిక్ పాండ్యా. Hardik Pandya