Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ గుండెకొస్తే కనిపించేది ఆ హీరోనేనట..ఈ విషయం ఎవరో చెప్పింది కాదు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ నోటి నుండి వచ్చిన వ్యాఖ్యలే.. మరి ఇంతకీ ఎన్టీఆర్ గుండె కోస్తే కనిపించే ఆ హీరో ఎవరు.. అనేది ఇప్పుడు చూద్దాం.జూనియర్ ఎన్టీఆర్ కి తన బాబాయ్ బాలకృష్ణ అంటే చాలా ఇష్టం అని ఇప్పటికే ఎన్నో సందర్భాలలో ఈయన చెప్పుకొచ్చారు.కానీ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Jr.NTR emotional comments

ఎందుకో గాని బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెడుతున్నారు. అయితే ఈ విషయం గురించి ఇప్పటికే పలు రూమర్స్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొంతమందేమోఎన్టీఆర్ ఎదుగుదల చూసి బాలకృష్ణ ఓర్వలేకే ఇలా ఫ్యామిలీకి దూరం పెడుతున్నారని అంటున్నారు. ఇక మరికొంతమందేమో ఫ్యామిలీ గొడవలు అంటున్నారు.కానీ దీనిలో ఏది నిజమో ఎవరికీ తెలియదు.(Jr.NTR)

Also Read: Pawan Kalyan: పొలం కొనడానికి డబ్బులు లేక అలాంటి పని చేసిన పవన్ కళ్యాణ్..?

ఇక రీసెంట్ గా టిడిపి కూటమి ఘన విజయం సాధించాక బాలకృష్ణకి,లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ విషెస్ తెలిపిన సంగతి మనకు తెలిసిందే.ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ అదుర్స్ సినిమా ఈవెంట్ కి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో బాలకృష్ణ గురించి ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.స్టేజ్ పైనే నా గుండె కోస్తే కనిపించేది తాత ఎన్టీఆర్ అని చాలామంది భావిస్తారు.

Jr.NTR emotional comments

కానీ నా గుండె కోస్తే బాబాయ్ బాలకృష్ణ కనిపిస్తారు.నాకు బాబాయ్ అంటే ఎంతో అభిమానం. నేను యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో పడ్డప్పుడు బాబాయ్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను చావు బతుకుల నుండి బయటపడ్డాను అంటే దానికి నా తాతయ్య, నా బాబాయ్ ఆశీస్సులే కారణం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం అప్పటి వీడియో మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.(Jr.NTR)