Kasthuri: సీరియల్ యాక్టర్ కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. తమిళ బిగ్ బాస్ షోలోను పాటిసిపేట్ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్ లో మెరిసింది. 50 ఏళ్లు వయసు దాటినా ఆమె అందం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ ఆమె నవ్వులో తెలియని మ్యాజిక్ ఉంటుంది.

Kasthuri’s interesting comments

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫోటో షూట్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 2000 సంవత్సరంలో కస్తూరి ఒక డాక్టర్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యూరప్ పెళ్లయిపోయింది. ఆ తర్వాత అమెరికాలో కొంతకాలం ఉంది. ఆ సమయంలో రోజుల వ్యవధి ఉన్న తన బాబుతో అమ్మతనాన్ని చిటి చెబుతు అర్థనగ్నంగా ఫోటోలు దిగింది. అవి కాస్త నెట్టింట వైరల్ కావడంతో కొందరు ఆమెను విమర్శి స్తే.. మరికొందరు అభినందించారు.

Also Read: Abhishek Bachchan: ఎస్ మేం విడాకులు తీసుకుంటున్నాం.. ఫైనల్ గా అసలు విషయం చెప్పిన అభిషేక్ బచ్చన్.!

తాజాగా కస్తూరి ఆ సందర్భం గురించి ఇలా చెప్పుకొచ్చింది. ఆ ఫోటో షూట్ నేను చేసింది ఇండియా కోసం కాదు..అమెరికాలో ఒక మ్యాగ్జైన్ కోసం ఇచ్చాను. అది భారత్లో పబ్లిష్ కాకూడదు. కానీ, భారత్ లో ఉన్న వీడియా వారు సెన్స్ లేకుండా ప్రచురించారు. కనీసం నన్ను కూడా అడగలేదు. ఇక్కడ ఉన్న వారికి నేను ఎవరికి అనుమతి ఇవ్వలేదు. కొంతకాలం తర్వాత ఒక ఆంగ్ల పత్రిక నన్ను సంప్రదించి ప్రచురించుకుంది. అందరూ దొంగతనంగా ఆ ఫోటోలు వేసుకున్నారు.భారత్ కల్చర్ కు ఆ ఫోటోలు పెద్దగా నచ్చవు..అది అమెరికన్ ప్రాజెక్ట్. ఒక మహిళ డెలివరీ అయిన తరువాత శరీరంలో మార్పులు వస్తాయి. దానిని అవగాహన కల్పించేదుకే ఆ ప్రాజెక్ట్ చేశాను.

Kasthuri's interesting comments

మాతృత్వానికి అమెరికా వాళ్ళు ఇచ్చే మర్యాద, మనం ఇచ్చే మర్యాద వేరుగా ఉంటుంది. ఆ ఫోటోలు లిక్ కావటం నాకు కూడా చాలా బాధగా అనిపించింది. బిడ్డకు పాలిచ్చే ఫోటోలను ఇక్కడి వారు చూస్తే విధానం వేరుగా ఉంటుంది. కానీ, అది తప్పని తెలుసుకున్న. కానీ, ఎవరు ఊహించని విధానం గా భారత్ నుంచి కూడా కొందరు మహిళలు నాకు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. ఎందుకంటే వారు కూడా అమ్మ స్థానం నుంచి వచ్చారు కాబట్టి దాని విలువ తెలుస్తుంది. గ్రామిణ మహిళలు నుంచి కూడా నాకు సపోర్ట్ దక్కింది. కొంతకాలం తర్వాత పెళ్లి అయిన పురుషులు కూడా నాకు అండగా నిలిచారు. ‘అని కస్తూరి తెలిపింది.(Kasthuri)