Nivetha Thomas: జెంటిల్ మెన్,నిన్ను కోరి, జై లవకుశ,118, వకీల్ సాబ్, శాకిని డాకిని వంటి సినిమాలతో హీరోయిన్ గా అలరించిన హీరోయిన్ నివేదా థామస్ అందరికీ తెలిసే ఉంటుంది.ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత నాని హీరోగా చేసిన జెంటిల్ మెన్ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Nivetha Thomas ready for marriage

అయితే లేడీ ఓరియంటెడ్ మూవీ అయినా శాకిని డాకిని మూవీ తర్వాత నివేదా థామస్ మళ్ళీ తెలుగులో ఏ సినిమాని కూడా చేయలేదు.ఇక మలయాళం లో ఒక సినిమా చేసి ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.ఇక ఇంటి దగ్గరే ఉండడం కారణంగా ఈ హీరోయిన్ బాగా లావు పెరిగిపోయిన ఫోటోలు,వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. (Nivetha Thomas )

Also Read: Poorna: పూర్ణ ఫస్ట్ లవ్.. అన్ని రోజులు ప్రేమించుకున్న ఈ జంట పెళ్ళెందుకు చేసుకోలేదు.?

అయితే ఈమె అధిక లావు కారణంగానే సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరోయిన్ తన ట్విట్టర్ ఖాతాలో ఒకపోస్ట్ పెట్టింది.అందులో ఏముందంటే…చాలా కాలం అయింది బట్ కుదిరింది అంటూ పోస్ట్ చేసేసరికి చాలామంది ఈ ఈమె అభిమానులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నివేద థామస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, అందుకే ఈ విధంగా హింట్ ఇచ్చిందని భావిస్తున్నారు.

Nivetha Thomas ready for marriage

ఇక మరి కొంతమందేమో కాదు కాదు కాదు ఈ హీరోయిన్ కి ఏదైనా కొత్త సినిమాలో ఆఫర్ వచ్చింది కావచ్చు. అందుకే ఈ పోస్ట్ పెట్టింది అని భావిస్తున్నారు. మరి ఈ హీరోయిన్ పెళ్లి కుదిరిందా లేక కొత్త సినిమాలో ఛాన్స్ వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.(Nivetha Thomas )