Ola Bikes: ఇండియన్ మార్కెట్లో… అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా టూ వీలర్ అలాగే కార్లు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో…. చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో… చాలా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు రకరకాల డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. Ola Bikes

Ola Electric Offers up to 15,000 Discount on S1 Series Scooters

తాజాగా ఓలా కంపెనీ ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 15 వేల వరకు ఆఫర్ ను ప్రకటించింది. ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ ఆఫర్లు ఈ స్కూటర్ పై 5వేల ప్లాట్ తగ్గింపుతో పాటు క్రెడిట్ కార్డు ఈఎంఐలపై 5వేల వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తున్నారు. క్రెడిట్ కార్డు, ఈఎంఐల ద్వారా ఈ స్కూటర్ కొనుగోలు చేసినప్పటికీ 35వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుంది. Ola Bikes

Also Read: Bajaj CNG Bike: ఫస్ట్ సీఎన్జీ బైక్ మార్కెట్లోకి వచ్చేస్తోంది…ధర, వివరాలు ఇవే ?

ముఖ్యంగా ఎంపిక చేసిన బ్యాంకుల నుంచి రుణాలపై 75 వేల వరకు క్యాష్ బ్యాక్ ను ఎంచుకోవచ్చు. ఈ స్కూటర్ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్ ప్రకారం )గా ఉంది. ఓలా ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ప్రో మోడల్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి రూ. 2,999 విలువైన ఓలా కేర్ ప్లస్ సబ్ స్క్రిప్షన్ ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. Ola Bikes

ప్యాకేజీలో భాగంగా వార్షిక సమగ్ర నిర్ధారణ, సర్వీస్ పిక్ అప్, వినియోగ వస్తువులు, దొంగతనం, రోడ్ సైడ్ అసిస్టెన్స్ తో సహా ఉచిత సేవలను కూడా కస్టమర్లు పొందే సదుపాయం ఉంటుంది. అలాగే ఓలా ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు, ఈఎంఐలపై 75,000 వరకు క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. ఓలా ఎస్ 1 ఎయిర్ ధర రూ. 1.05 లక్షలు కాగా, ఎస్ 1 ప్రో ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. Ola Bikes