Vijay: కోలీవుడ్ దళపతి విజయ్ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈయన ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. ఇక ఈయన ఏ సినిమా చేసినా కూడా సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఈయన చేసిన సినిమా గురించే మాట్లాడుకుంటారు. మరీ ముఖ్యంగా ఈయన మూవీ విడుదలవుతుందంటే చాలు అభిమానులకు పండగే.

The director who left the star heroine aside because she made Vijay fall in love

అయితే అలాంటి స్టార్ హీరో విజయ్ రీసెంట్ గానే సినిమాలు పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వస్తున్నాను అని ఒక సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేసే సినిమలే చివరివని కూడా చెప్పారు.అయితే అలాంటి విజయ్ కి ఓ హీరోయిన్ తో ఎఫైర్** ఉందని తెలియడంతో ఓ డైరెక్టర్ ఆ హీరోయిన్ ని పక్కన పెట్టేసారట.ఇక ఆ డైరెక్టర్.. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..(Vijay )

Also Read: Jr.NTR: నా గుండె కోస్తే కనిపించేది ఆ హీరోనే.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్..!

విజయ్ ఎఫై** పెట్టుకున్న హీరోయిన్ అంటే అప్పట్లో నటి సంఘవి పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. అప్పట్లో సంఘవి విజయ్ కాంబినేషన్లో దాదాపు రెండు మూడు సినిమాలు వచ్చాయి. అలా వీరి కాంబినేషన్ ఎక్కువ సార్లు రిపీట్ అవ్వడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని కోలీవుడ్ మీడియాలో చర్చ జరిగింది.

 The director who left the star heroine aside because she made Vijay fall in love

దాంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి విజయ్ తండ్రి డైరెక్టర్ ఎస్ ఏ చంద్రశేఖర్ చెవిలో పడడంతో తన కొడుకు సినిమాలో సంఘవిని పక్కన పెట్టేసారట. ఎందుకంటే వీరి సినిమాలు ఇలాగే కొనసాగితే ఈ రూమర్స్ మరి ఎక్కువైపోతాయి అనే ఉద్దేశంతో సంఘవిని డైరెక్టర్ ఎస్.ఏ చంద్రశేఖర్ పక్కన పెట్టినట్టు అప్పట్లో ఓ టాక్ వినిపించింది.(Vijay )