Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 60 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో చాలామంది సల్లూ భాయ్ అభిమానులు ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా.. ఎప్పుడు పిల్లా పాపలతో హాయిగా జీవితాన్ని కొనసాగిస్తారా అని వేయి కళ్ళతో చూస్తుంటారు. కానీ ఇప్పటివరకు ఆయన అభిమానులు కోరుకున్న పెళ్లి విషయం మాత్రం జరగడం లేదు.

Why is Salman Khan still not married

అంతే కాదు ఎంతోమంది హీరోయిన్ లతో ఎఫైర్ పెట్టుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే అంటూ సల్మాన్ ఖాన్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంతకీ సల్మాన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..(Salman Khan)

Also Read: Nivetha Thomas: పెళ్లికి రెడీ అయిన నాని హీరోయిన్.. ఫిక్స్ అయింది అంటూ పోస్ట్..!

సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి తన తల్లిలాగే ఇంట్లో అందరికీ సేవలు చేస్తూ అందరికీ సహాయపడుతూ ఇంటి పనులు, వంట పనులు అన్ని చక్కగా చేసేదై ఉండాలి అని సల్మాన్ భావిస్తాడు. తన తల్లిలా ఓర్పు, సహనం, ఇంట్లో పని చేసే అమ్మాయి కోసమే సల్మాన్ చూస్తున్నాడు.

Why is Salman Khan still not married

కానీ ఈ జనరేషన్ లో అలాంటి అమ్మాయిలు లేరు కదా. అందుకే సల్మాన్ కి ఇప్పటికీ పెళ్లి కావడం లేదు. త లైఫ్ లోకి వచ్చే అమ్మాయి తన తల్లిలాగే ఉండాలి అనుకుంటాడు.. అంటూ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి సంచలన విషయాన్ని బయట పెట్టాడు సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్.(Salman Khan)