Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది.అలాంటి ఈ ముద్దుగుమ్మ మన ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ లలో మొదటి ప్లేస్ లో ఉంది.అయితే ప్రస్తుతం కల్కి సినిమా మరికొద్ది గంటల్లో విడుదలవబోతుండగా సినిమా పై రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరిలో ఆసక్తి అయితే నెలకొంది.

Deepika Padukone good heart..by adopting that village

అయితే కన్నడ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దీపిక పదుకొనే గతంలో ఓ తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించినప్పటికీ అది విడుదలవ్వవలేదు. కానీ ఇలా ప్రభాస్ సరసన కల్కి మూవీలో నటించి తెలుగు తెరకు పరిచయమవుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తెలుగులో ఇప్పటివరకు ఏ సినిమాలో నటించకపోయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం చాలా మంది దీపిక అభిమానులు ఉన్నారు.(Deepika Padukone)

Also Read: Vijay: విజయ్ ని ప్రేమలో దింపిందని స్టార్ హీరోయిన్ ని పక్కన పెట్టిన డైరెక్టర్..?

ఇదిలా ఉంటే దీపిక ప్రస్తుతం ప్రెగ్నెన్సీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇక తాజాగా దీపికా పదుకొనే గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే ఈ హీరోయిన్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుందట.అయితే అదేదో సినిమాలో చెప్పినట్టు వినడానికి బాగానే ఉంది కానీ ఇది నిజమేనా అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇది నిజమే.మహేష్ బాబు శ్రీమంతుడు మూవీలో హీరోగా ఊరిని దత్తత తీసుకుంటున్నాను అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పటి నుండి చాలామంది సెలబ్రిటీలు ఊర్లను దత్తత తీసుకుంటూ తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.

Deepika Padukone good heart..by adopting that village

అయితే ఈ సినిమా రాకముందే కొంతమంది సెలబ్రిటీలు పేదవారికి సహాయం చేస్తూ ఉండేవారు.కానీ ఈ సినిమా వచ్చాక మరింత సహాయం చేస్తున్నారు. అయితే దీపికా పదుకొనే మహారాష్ట్రలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్నో అభివృద్ధి పనులు చేసిందట. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది ఈమె అభిమానులు దీపిక మంచి మనసుకు హాట్సాఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Deepika Padukone)