Sonakshi Sinha: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హ తన చిరకాల ప్రియుడు అయినటువంటి జహీర్ ఇక్బాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే జహీర్ ఇక్బాల్ తనకంటే వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా ప్రేమకి వయసుతో పనిలేదు అని ఆ వ్యక్తితో సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అలాగే వీరిద్దరి మతాలు వేరు కావడంతో మొదట్లో ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదట. కానీ ఇద్దరు తమ పెళ్లి కోసం ఇంట్లో ఎంతగానో కొట్లాడి మరి తల్లిదండ్రులను ఒప్పించారు.

The red saree worn by Sonakshi Sinha at the reception is so cheap

ఇక పెళ్లి రేపు అనగా కూడా అసలు సోనాక్షి తండ్రి శత్రజ్ఞ సిన్హ వస్తాడో రాడో అనే దానిపై అందరికీ ఒక ఉత్కంఠ అయితే ఉండేది. కానీ ఎట్టకేలకు శత్రజ్ఞ కూతురు పెళ్లిగా హాజరయ్యి పుకార్లన్నింటికీ చెక్ పెట్టారు. ఇదిలా ఉంటే పెళ్లికి తెలుపు రంగు చీరలో అందరిని అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ రిసెప్షన్ పార్టీకి ఎరుపు రంగు పట్టు చీరలో అందరిని చూపు తిప్పుకోకుండా చేసింది.(Sonakshi Sinha)

Also Read: Amitabh Bachchan: డార్లింగ్ ఫాన్స్ కి క్షమాపణలు చెప్పినా అమితాబ్.. కారణం ఇదే..!

అయితే బాలీవుడ్ సెలబ్రెటీలు ఎవరైనా సరే ఎక్కువగా వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకొని రిసెప్షన్ పార్టీని చేసుకుంటారు. కానీ వారందరికీ భిన్నంగా సోనాక్షి సిన్హా పద్ధతిగా ఒంటినిండా ఎర్రటి చీర కట్టుకొని నుదుటిన బొట్టు,పాపిట సింధూరం, చేతికి ఎర్ర గాజులు, మెడలో నెక్లెస్,చెవులకు దుద్దులు పెట్టుకొని అచ్చ తెలుగు ఆడపిల్లలాగా రెడీ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగితే వారి పెళ్లి చీరలకు సంబంధించిన ధరలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

 The red saree worn by Sonakshi Sinha at the reception is so cheap

అయితే తాజాగా సోనాక్షి సిన్హా కట్టుకున్న రిసెప్షన్ సారీ ధర కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఇక సోనాక్షి తన రిసెప్షన్ కి కట్టుకున్న ఆ ఎర్ర చీర ధర అక్షరాల79,800.. అయితే ఈ ధర తెలిసిన జనాలు చాలా సింపుల్ గా పెళ్లి చీరలను లక్షలు లక్షలు పెట్టి కొనుక్కునే సెలబ్రిటీలకు భిన్నంగా సోనాక్షి ఎంపిక ఉంది. ఆమె తన రిసెప్షన్ చీర కోసం కనీసం లక్ష కూడా ఖర్చు చేయలేదు అని షాక్ అవుతున్నారు.(Sonakshi Sinha)