Kalki 2898 AD: పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమా కల్కి. ఈ మూవీ ఈనెల 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ పూర్తి సైన్స్ సెక్షన్ కథతో రూపొందించిన తీరు అద్భుతంగా ఉండబోతుందని ఆడియన్స్ ఇప్పటికే బీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Kalki: గూజ్బమ్స్‌ తెప్పిస్తున్న కల్కి థీమ్ సాంగ్.. కల్కి అవతారం కేక..!

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో భారీ క్యాస్టింగ్ ఉండనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. వారితో పాటు పలు పాత్రలు ప్రేక్షకులను మిశ్మరైజ్ చేసే విధంగా ఉండబోతున్నాయి. ఇక వీటిలో శ్రీకృష్ణుడి పాత్ర కూడా ఉందట.

అయితే ఈ పాత్రను విఎఫెక్ట్స్ తో తీర్చిదిద్దారని ఆ పాత్రలో లెజెండ్రీ యాక్టర్ నందమూరి తారక రామారావు కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ లోగో లోను శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారు. ఇప్పుడు కల్కి సినిమాలోను మరోసారి శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారని టాప్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Kalki 2898 AD)