AP: ఏపీ పంచాయతీ రాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి పనిచేస్తానని దేశం మెచ్చే విధంగా ఏపీ పంచాయతీ రాజ్ వ్యవస్థకు సొబగులు తీసుకువస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమస్యలు వింటూ వాటిని నోట్ చేసుకున్నారు. భారతదేశం మెచ్చే విధంగా జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసే విధంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేద్దామని ఆయన అన్నారు. దీనికి నేను కంకణ బుద్ధుడునై పని చేస్తానని నా ఒక్కడి వల్లనే ఈ మహాక్రతువు పూర్తి కాదని అన్నారు.

Pavan kalyan spoke on major changes in AP

ఉద్యోగులు సహకారం సూచనలు చాలా అవసరమని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు పతనమయ్యాయని వాటిని తిరిగి గాడిలో పెట్టడం సాధారణ విషయం కాదని అన్నారు. ఆయన ప్రజలకు ఉపయోగపడేలా వ్యవస్థలకు మళ్ళీ జీవం పోసేలా బలమైన సంకల్పంతో పని చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలో తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పెద్ద ఎత్తున కలసి సమస్యలపై పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాలు ఇచ్చారు.

Also read: Vijay: ఆ హీరోయిన్ తో మళ్లీ ప్రేమాయణం నడుపుతున్న విజయ్.. భార్యతో ఇబ్బందులు తప్పవా.?

శాఖల్లోని సమస్యలు ప్రభుత్వంలో రావాల్సిన బకాయిలు వారి పదోన్నతులు ఇతర శాఖ పరమైన అంశాలను పూర్తిస్థాయిలో పవన్ కి నివేదించి వాటి వివరాలను ప్రత్యేకంగా తెలియజేశారు. వీటిని అసాంతం విన్న ఆయన రాసుకున్నారు. వ్యవస్థలను గత ప్రభుత్వం ఎంత నాశనం చేశారనే విషయాలను కీలక శాఖలోని వాస్తవాలను ప్రజల ముందు పెట్టడానికి శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తాము. పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లమాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు (AP).