Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీ… కాంగ్రెస్ లో విలీనం కాబోతున్నట్లు… వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే అనపర్తి బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతి త్వరలోనే వైసీపీ పార్టీని… కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి విలీనం చేస్తారని ఆయన ఆరోపణలు చేశారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిన సంగతి మనందరికీ తెలిసిందే. Jagan

BJP MLA Nallamilli Ramakrishna Reddy Said Jagan Is Negotiating To Merge YCP In Congress

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో… 11 స్థానాలకి వైసీపీ పార్టీ పరిమితమైంది. 175కు 175 కొడతానని… జగన్మోహన్ రెడ్డి శపథం చేశారు. కానీ పరిస్థితి ఉల్టా పల్టా అయింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణంగా ఓడిపోవడమే కాకుండా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. Jagan

Also Read: NTR: కొడాలి నాని, వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..?

పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి డీకే శివకుమార్ తో చర్చలు చేసినట్లు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో వైసిపి విలీనం… అంశం తెరపైకి వచ్చినట్లు… నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే డీకే శివకుమార్ ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కండిషన్ కూడా పెట్టినట్లు ఆయన తెలిపారు. Jagan

వైయస్ షర్మిల ను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే… వైసిపి పార్టీని విలీనం చేస్తానని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారట. దీనికి డీకే శివకుమార్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి అని… బిజెపి ఎమ్మెల్యే పేర్కొనడం ఇప్పుడు వివాదంగా మారింది. అయితే… బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి చేసిన వ్యాఖ్యలకు… పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. జగన్ను జైల్లో వేసిన కాంగ్రెస్ పార్టీకి తాము సపోర్ట్ గా ఉండమని పేర్ని నాని తెలిపారు. Jagan